Share News

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక!

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:22 PM

తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు కనీవినీ ఎరుగని రీతిలో భారీ కానుక సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా 121 కిలోల బంగారంతో తయారు చేయించిన ఆభరణాలను శ్రీవారి పాదాల చెంత సమర్పించనున్నారు.

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక!
Tirumala gold donation

అమరావతి, నవంబరు 21: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు అపూర్వమైన కానుకను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఏడుకొండల వాడిపై తనకున్న అపారమైన భక్తిని చాటుకుంటూ ఏకంగా 121 కిలోల బంగారంతో తయారు చేయించిన ఆభరణాలను స్వామివారికి కానుకగా అందించనున్నారు. ఈ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.160 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మొత్తం 9 సెట్లుగా రూపొందించిన 45 రకాల బంగారు ఆభరణాలను స్వామివారి సేవలో సమర్పించేందుకు భక్తుడు ఏర్పాట్లు పూర్తి చేశారు.


ఈ భారీ కానుక సమర్పణకు సంబంధించి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులతో సదరు భక్తుడు సంప్రదింపులు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ నెల 26వ తేదీన తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో టీటీడీ అధికారులకు ఈ బంగారు ఆభరణాలను అధికారికంగా అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు, ప్రక్రియలపై టీటీడీతో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 121 కిలోల బంగారంతో తయారు చేసిన 45 ఆభరణాలు, 9 సెట్లుగా స్వామివారికి చేరనుండటంతో ఈ కానుకకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్‌కు నాలుగు సూటి ప్రశ్నలు..

ఆసక్తికరంగా కొలత్తూరు ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా..?

Updated Date - Nov 21 , 2026 | 05:38 PM