Share News

మునగాల కొండపై పెద్దపులి సంచారం.. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు..

ABN , Publish Date - Apr 24 , 2026 | 09:29 PM

మునగాల కొండపై పెద్దపులి సంచరిస్తోంది. పెద్దపులి గురువారం రాత్రి 8:30 నుంచి 11 గంటల మధ్యలో శ్రీరంగపట్నం చెరువులో ఈదుకుంటూ మునగాల కొండపైకి చేరింది.

మునగాల కొండపై పెద్దపులి సంచారం.. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు..
tiger spotted East Godavari

అమరావతి, ఏప్రిల్ 24: తూర్పు గోదావరి జిల్లాలోని మునగాల కొండపై పెద్దపులి సంచరిస్తోంది. పెద్దపులి గురువారం రాత్రి 8:30 నుంచి 11 గంటల మధ్యలో శ్రీరంగపట్నం చెరువులో ఈదుకుంటూ మునగాల కొండపైకి చేరింది. మునగాల కొండపై పెద్దపులి సంచారంపై జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. పెద్దపులి కదలికలను మూడు టీంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఒక టీం, రాజమండ్రిలో ఉన్న ఒక టీం, మత్తు డాక్టర్ల టీం ఆధ్వర్యంలో పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.


ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘థర్మల్ డ్రోన్ ద్వారా చీకట్లో కూడా పులి కదలికలను తెలుసుకుంటున్నాము. రెండు రోజుల క్రితం కాపవరం పాండవుల కొండ దగ్గరికి వచ్చిన మార్గంలోనే పులి ప్రయాణం కొనసాగిస్తోంది. పెద్దపులి మొదటిసారి జిల్లాలోకి వచ్చినప్పుడు ప్రజలను కంట్రోల్ చేయడానికి కొంత ఇబ్బంది ఉండేది. ప్రస్తుతం పులి కొండపై ఉండటంవల్ల ఇబ్బంది లేదు’..


‘పెద్దపులి పశువులపైనే దాడి చేస్తోంది. మనుషులకు హాని చేయటం లేదు. పెద్దపులి నాలుగు రోజులకు ఒకసారి జంతువులను వేటాడి తింటుంది. పెద్దపులి ప్రస్తుతం ఆకలితో ఉంది. దానికి ఆహారంగా కొన్ని పశువులను సిద్ధంగా పెట్టాం. పులిని బంధించేందుకు రెండు బోన్లను కూడా సిద్ధంగా ఉంచాం’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2026: సాయి సుదర్శన్ సెంచరీ.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

మచిలీపట్నంలో ఉద్యోగినికి వేధింపులు.. మహిళా కమిషన్ విచారణ

Updated Date - Apr 24 , 2026 | 09:37 PM