Share News

వెళ్లినట్టే వెళ్లి.. తిరిగొచ్చింది!

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:34 AM

ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోకి మళ్లీ పెద్దపులి ప్రవేశించింది. గత రెండు రోజులుగా వేలేరుపాడు మండలంలో సంచరించిన పెద్దపులి గురువారం తెలంగాణలోకి ప్రవేశించిందని ...

వెళ్లినట్టే వెళ్లి.. తిరిగొచ్చింది!

జిల్లేళ్లగూడెం సమీపంలో ఎద్దును చంపిన పులి

జీలుగుమిల్లి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోకి మళ్లీ పెద్దపులి ప్రవేశించింది. గత రెండు రోజులుగా వేలేరుపాడు మండలంలో సంచరించిన పెద్దపులి గురువారం తెలంగాణలోకి ప్రవేశించిందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే అర్ధరాత్రి అది జీలుగుమిల్లి మండలం జిల్లేళ్లగూడెం అడవిలోకి ప్రవేశించింది. శుక్రవారం తెల్లవారుజామున అడవి సమీపంలోని పొలాల్లో కట్టేసి ఉన్న ఎద్దుపై దాడి చేసి చంపింది. ప్రస్తుతం జిల్లేళ్లగూడెం, బొత్తప్పగూడెం సమీప సంగంవాగు ప్రాంతంలో పులి మకాం వేసినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 05:35 AM