Share News

రోడ్డుపై పంట నూర్పిడి చేస్తుండగా..!

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:28 AM

తమ పొలంలో పండిన కొద్దిపాటి వరిని రోడ్డుపైనే ఒకపక్కగా నూర్పిడి చేసుకుంటున్నారు.. ఇంతలోనే వారిపైకి కారు దూసుకువచ్చింది.

రోడ్డుపై పంట నూర్పిడి చేస్తుండగా..!

  • కారు ఢీకొని ముగ్గురు మహిళల దుర్మరణం

  • మృతుల్లో అత్తాకోడలు..చిత్తూరు జిల్లాలో విషాదం

పలమనేరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): తమ పొలంలో పండిన కొద్దిపాటి వరిని రోడ్డుపైనే ఒకపక్కగా నూర్పిడి చేసుకుంటున్నారు.. ఇంతలోనే వారిపైకి కారు దూసుకువచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. వీరిలో ఇద్దరు అత్తా కోడళ్లు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో గురువారం చోటుచేసుకుందీ ఘటన. పోలీసుల కథనం మేరకు.. పెంగరగుంటకు చెందిన ముగ్గురు మహిళలు.. గ్రామ సమీపంలోని పలమనేరు- గుడియాత్తం రహదారిపై గురువారం పంటనూర్పిడి చేస్తున్నారు.

ఇలా చేయడం ప్రమాదకరమే అయినా.. కొద్దిపాటి వరి పంటే కావడంతో పలుచోట్ల ఇలా నూర్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో గుడియాత్తం నుంచి పలమనేరు వస్తున్న కారు వీరిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సాలమ్మ(70) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె కోడలు మునెమ్మ(40), వీరి బంధువు, గ్రామానికి చెందిన ఆర్‌.జ్యోతి(45)ని చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

బాలకృష్ణకు విశిష్ట పురస్కారం.. రేవంత్ సర్కార్ నుంచి అరుదైన గౌరవం

Updated Date - Nov 20 , 2026 | 01:35 AM