Share News

గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:37 AM

గంజాయిని చాక్లెట్ల రూపంలో ప్యాకెట్లగా తయారుచేసి తరలిస్తున్న ముగ్గురు యువకులను తుని జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

  • హౌరా- చెన్నై మెయిల్‌లో తనిఖీలు.. తుని రైల్వే స్టేషన్‌లో పట్టివేత

తుని రూరల్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): గంజాయిని చాక్లెట్ల రూపంలో ప్యాకెట్లగా తయారుచేసి తరలిస్తున్న ముగ్గురు యువకులను తుని జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది శుక్రవారం అరెస్ట్‌ చేశారు. కాకినాడ జిల్లా తుని జీఆర్‌పీ ఎస్‌ఐ వి.సత్తిబాబుకు అందిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం హౌరా-చెన్నై మెయిల్‌ జనరల్‌ కోచ్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ముగ్గురు యువకులు తుని రైల్వేస్టేషన్‌ ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారంపై లగేజ్‌ బ్యాగులతో దిగి అనుమానాస్పదంగా సంచరించడాన్ని సిబ్బంది గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద మూడు చొప్పున గంజాయి చాకెట్ల ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని మనోజ్‌ ప్రధాన్‌(27), సంబునాథ్‌ జనా (29), అజయ్‌ జనా(25)గా గుర్తించారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 05:37 AM