Share News

ఇంద్రకీలాద్రి పైనుంచి కిందపడిన మహిళ

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:26 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చిన మార్కాపురం జిల్లా గుర్రపుశాలకు చెందిన పిట్టమల్ల బాల అంజమ్మ(24) క్యూలో నిలబడి ఉండగా కళ్లు తిరగడంతో ప్రమాదవశాత్తు

ఇంద్రకీలాద్రి పైనుంచి కిందపడిన మహిళ

  • కాపాడిన ఆలయ సిబ్బంది

ఇంద్రకీలాద్రి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చిన మార్కాపురం జిల్లా గుర్రపుశాలకు చెందిన పిట్టమల్ల బాల అంజమ్మ(24) క్యూలో నిలబడి ఉండగా కళ్లు తిరగడంతో ప్రమాదవశాత్తు పైనుంచి సుమారు 15 అడుగుల కిందకు పడిపోయింది. వెంటనే ఆలయ అధికారులు, సెక్యూరిటీ ఎస్‌వో, సూపర్‌వైజర్లు అంజమ్మ పడిపోయిన ప్రదేశానికి చేరుకుని ఆమెను బయటకు తీసుకొచ్చి ఆలయ అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు స్వల్ప గాయాలుకాగా వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 05:26 AM