ఇరు రాష్ట్రాల మధ్య స్నేహబంధం కొనసాగాలి
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:26 AM
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్నేహబంధం కొనసాగాలని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కొవ్వూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్నేహబంధం కొనసాగాలని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ.. రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని ముందునుంచి అనుకున్నామని పేర్కొన్నారు. కృష్ణా నదిలో నీరు తక్కువగా ఉందని, కృష్ణా నది నుంచి అనుమతులు లేని ప్రాజెక్టుల ద్వారా ఏపీ ప్రభుత్వం నీరు తరలించడం అనే అంశంపై తెలంగాణ ప్రాంతంలో కొంత గందరగోళం నెలకొందని తెలిపారు.
రాష్ట్ర పునర్విభజన నిబంధనల ప్రకారం అపెక్స్ కౌన్సిల్ పెట్టుకుని నీటి పంపకాల విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నట్టయితే ఇరు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడినట్టు అవుతుందని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహబంధం కొనసాగాలని, అలా కాకుండా బీజేపీతో పొత్తులో ఉన్నామని బుల్‌డోజర్లతో తెలంగాణ హక్కులు కొల్లగొడతామంటే పాత పరిస్థితులే పునరావృతం అవుతాయన్నారు.
ఈ వార్తలనూ చదవండి: