సాయం సరిపోతుందా..!
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:06 AM
విద్యుత్తు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు తెలంగాణ విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఫోను చేశారు.
మంత్రి గొట్టిపాటికి టీ-మంత్రి భట్టి ఫోన్
విద్యుత్తు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు తెలంగాణ విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఫోను చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణ చర్యలు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది, సామాగ్రి కొరత ఉంటే తెలియజేయాలని, వెంటనే పంపుతామన్నారు. గొట్టిపాటి స్పందిస్తూ... క్షేత్రస్థాయిలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను భట్టికి వివరించారు. తెలంగాణ నుంచి వచ్చిన 1100 మంది విద్యుత్తు సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు. సాయం కోరిన వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వానికి గొట్టిపాటి కృతజ్ఞత తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!