Share News

ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు పార్టీ జెండా వదల్లేదు: లోకేశ్

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:11 PM

ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు టీడీపీ జెండా వదల్లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, మెడపై కత్తిపెట్టి బెదిరించినా వెనక్కి మాత్రం తగ్గలేదని తెలిపారు.

ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు పార్టీ జెండా వదల్లేదు: లోకేశ్
Nara Lokesh speech

అమరావతి, మార్చి 29: ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు టీడీపీ జెండా వదల్లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, మెడపై కత్తిపెట్టి బెదిరించినా వెనక్కి మాత్రం తగ్గలేదని తెలిపారు. తెలుగు దేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ..‘అనేక సంక్షేమ కార్యక్రమాలు పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌. కష్టపడే కార్యకర్తను ఎప్పుడూ గుర్తిస్తాం.. గౌరవిస్తాం. అలక వీడాలని పార్టీ నేతలు, కార్యకర్తలను కోరుతున్నా. మీరు అలిగితే పార్టీతో పాటు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. జగన్‌కు ఈ మధ్య క్రెడిట్‌ చోరీ డిజార్డర్‌ జబ్బు వచ్చింది. వచ్చే కంపెనీలను తానే తెచ్చానని జగన్‌ చెప్పుకుంటున్నారు. కార్యకర్తల సంక్షేమానికి రూ.150 కోట్లు ఖర్చు చేశాం’ అని అన్నారు.


ముఖ్య ఘట్టాలతో వీడియో ప్రెజెంటేషన్‌

ఈ కార్యక్రమంలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన ముఖ్య ఘట్టాలతో వీడియో ప్రెజెంటేషన్‌ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ రథయాత్ర, సంక్షేమ కార్యక్రమాలు, విధాన నిర్ణయాలు వివరిస్తూ వీడియో సాగింది. ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన కార్యక్రమాలతో వీడియో ప్రెజెంటేషన్‌ అద్భుతంగా ఉంది. పార్టీ కోసం లోకేశ్ చేసిన కృషి, పాదయాత్రతో పాటు 2019-24 మధ్య జరిగిన హింస, దౌర్జన్యాలు వివరిస్తూ వీడియో ఉంది. చంద్రబాబు, సీనియర్‌ నేతలపై కేసులు, అరెస్టుల తీరును వివరిస్తూ వీడియో సాగింది. వీడియో ప్రెజెంటేషన్‌లో వైఎస్‌ వివేకా హత్య అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించటం జరిగింది.


ఇవి కూడా చదవండి

రావిచెట్టు... ఔషధ విలువలు

టీవీకే అభ్యర్థులు వీళ్లే.. రెండు చోట్ల నుంచి బరిలోకి దిగనున్న విజయ్..

Updated Date - Mar 29 , 2026 | 01:15 PM