11 మున్సిపాలిటీల్లో వైస్‌చైర్‌పర్సన్ల ఎన్నిక పూర్తి
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:15 AM
రాష్ట్రంలో 11 మున్సిపాలిటీల్లో వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు పూర్తయ్యాయి. వీటిలో పార్టీల వారీగా టీడీపీ నుంచి ఆరుగురు, జనసేన తరఫున ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరికి...
టీడీపీకి 6, జనసేనకు 3, బీజేపీకి 2
నర్సీపట్నం, మాచర్లలో కోరం లేక వాయిదా
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 11 మున్సిపాలిటీల్లో వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు పూర్తయ్యాయి. వీటిలో పార్టీల వారీగా టీడీపీ నుంచి ఆరుగురు, జనసేన తరఫున ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరికి ఈ పదవులు దక్కాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, పల్నాడు జిల్లా మాచర్లలో తగినంత కోరం లేక ఎన్నికలను వాయిదావేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మంగళవారం వెల్లడించింది. పలాస-కాశీబుగ్గ వైస్ చైర్‌పర్సన్‌గా వి.అశోక్, యలమంచిలి-గొర్లె శివన్నారాయణమూర్తి, ఆత్మకూరు-కొలగాని శిరీష, నాయుడుపేట-కె.కోటేశ్వరరావు, పుత్తూరు-బీఆర్ లత, జమ్మలమడుగు-గంజికుంట జయలక్ష్మి, రాజంపేట-షబ్రీన్ నూర్, యర్రగుంట్ల-శ్వేత ఇట్రెడ్డి, ధర్మవరం-యంగలశెట్టి విజయలక్ష్మి, గూడూరు-కోడుమూరు పాషావలి, ఆళ్లగడ్డ వైస్ చైర్‌పర్సన్‌గా కాటసాని వసంత ఎన్నికయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి