34 శాతం రిజర్వేషన్ సామాజిక న్యాయానికి నిదర్శనం: బుద్దా
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:14 AM
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు సామాజిక న్యాయానికి నిదర్శనమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు.
విజయవాడ అర్బన్, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు సామాజిక న్యాయానికి నిదర్శనమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు అభినందనలు తెలియజేస్తూ విజయవాడలో శనివారం పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జరిగిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ఎంతో కీలకమైన అంశమన్నారు. ఈ లక్ష్యంతో సీఏం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం