గ్రామాభివృద్ధికి కృషి చేసే అభ్యర్థులనే గెలిపించండి: అప్పసాని
ABN , Publish Date - Nov 24 , 2026 | 04:03 AM
గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి పనిచేస్తున్న ఎన్డీయే కూటమికి పంచాయతీ ఎన్నికల్లో మరోసారి ప్రజలు మద్దతుగా నిలవాలని...
అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి పనిచేస్తున్న ఎన్డీయే కూటమికి పంచాయతీ ఎన్నికల్లో మరోసారి ప్రజలు మద్దతుగా నిలవాలని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేశ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 26, 29, డిసెంబరు 2న మూడు విడతలుగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాజకీయ కక్షలు, వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా గ్రామాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే అభ్యర్థులను ఎన్నుకోవాలని రాజేశ్ కోరారు.
ఈ వార్తలనూ చదవండి: