టీచర్లకు అండగా కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Sep 26 , 2026 | 06:13 AM
జగన్ రౌడీ షీటర్లకు అండగా నిలుస్తున్నారని, అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీచర్లకు అండగా నిలబడుతుందని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేశ్ అన్నారు.
రౌడీషీటర్లకు అండగా జగన్: అప్పసాని రాజేశ్
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): జగన్ రౌడీ షీటర్లకు అండగా నిలుస్తున్నారని, అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీచర్లకు అండగా నిలబడుతుందని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేశ్ అన్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన బురదను ఎదుటివారికీ అంటించాలని జగన్ ప్రయత్నిస్తుంటారని, లక్షల కోట్ల అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లిన ఆయన.. తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించి జైలుకు పంపి తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకున్నారని అన్నారు. ఇప్పుడు డీఎస్సీ విషయంలోనూ అదే విధంగా చేస్తున్నారని, గ్రూప్-1లో తాను చేసిన అక్రమాల మకిలిని డీఎస్సీపై పూసి మరోసారి తనకు తానే చేటు చేసుకుంటున్నారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 372 మందిలో 252 మందికి వైసీపీ హయాంలో ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలు వచ్చాయని, మరి వారు ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా నకిలీవేనా? అని ప్రశ్నించారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ