గొడ్డలి పార్టీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:57 AM
రాష్ట్ర ప్రజలు ఎన్ని సార్లు ఛీకొట్టినా గొడ్డలి పార్టీ ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
గొడవలు సృష్టించి గెలవాలన్నదే జగన్ ఆలోచన: పల్లా
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలు ఎన్ని సార్లు ఛీకొట్టినా గొడ్డలి పార్టీ ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు చేస్తూ ఓటర్లను భయభ్రాంతులను చేయడం ద్వారా గెలవాలని చూస్తోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసిన తర్వాత పరిషత్ ఎన్నికల్లో గొడవలు సృష్టించి గెలవాలనే ఆలోచనతో జగన్ ఉన్నారని విమర్శించారు.
కడపలో ఎంపీ అవినాశ్ రెడ్డి, జగన్ రెడ్డి కుటుంబసభ్యులు నిబంధనలకు విరుద్ధంగా బూతుల్లోకి ప్రవేశించడం వంటి సంఘటనలు వైసీపీకి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న లెక్కలేనితనాన్ని చాటుతోందని అన్నారు. బయటి ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకొచ్చి కుప్పంలో ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారన్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తపై దాడి, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి కుమారుడి దౌర్జన్యం వంటి సంఘటనలు వైసీపీ విధానాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. విద్వేషం, హింస ద్వారా ఓట్లు గెలవాలనుకుంటే ప్రజలు సహించరని హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ