కాంగ్రెస్‌తో పొత్తు కోసమే ‘సర్’పై నాటకమా?
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:00 AM
2023లో కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల సంఘం నియామక చట్టానికి మద్దతు పలికిన వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఉండాలని సరికొత్త డిమాండ్లు తెరపైకి తేవడం వెనుక..
జగన్‌పై టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఫైర్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): 2023లో కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల సంఘం నియామక చట్టానికి మద్దతు పలికిన వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఉండాలని సరికొత్త డిమాండ్లు తెరపైకి తేవడం వెనుక ఆంతర్యమేమిటని టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ‘సర్’ ప్రక్రియ రాజకీయంగా దుర్వినియోగమవుతోందంటూ ఓవైపు జగన్ బహిరంగ విమర్శలు గుప్పిస్తూ.. మరోవైపు సర్ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ వైసీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఎందుకు ఆశ్రయించారో సమాధానం చెప్పాలని నిలదీశారు. న్యాయస్థానంలో ఒకలా, ప్రజల ముందు మరోలా వ్యవహరిస్తూ నాటకాలాడుతున్నారని లావు శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల ముంగిట తమ మాతృసంస్థ అయిన కాంగ్రెస్ పార్టీతో జరగబోయే రాజకీయ సర్దుబాట్లు, పొత్తుల్లో భాగమే ఈ సరికొత్త నాటకమా? అని నిలదీశారు. ఇప్పటికేౖనా జగన్ తన ద్వంద్వ వైఖరిని వీడి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు