రోజువారీ విచారణ అంటే ఉలుకెందుకు జగన్: ఎమ్మెల్సీ వర్ల
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:57 AM
‘తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.43 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన కేసుల్లో రోజువారీ విచారణ చేసేందుకు కోర్టు సిద్ధమైతే జగన్కు దిక్కుతోచడం లేదు...
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ‘తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.43 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన కేసుల్లో రోజువారీ విచారణ చేసేందుకు కోర్టు సిద్ధమైతే జగన్కు దిక్కుతోచడం లేదు. ఆయన ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?’ అని ఎమ్మెల్సీ వర్ల రామయ్య ప్రశ్నించారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుతో మాట్లాడారు. ‘ 14 ఏళ్లు డిశ్చార్జి పిటిషన్ల ద్వారా తనపై ఉన్న కేసుల విచారణను అడ్డుకున్న జగన్ ఆటలు ఇకపై సాగవు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి మద్యం స్కాంలో రూ.3,500 కోట్లు స్వాహా చేశారు. వివేకా హత్య కేసు హంతకులకు రూ.40 కోట్ల సుపారీ ఇచ్చారనే ఆరోపణల్లో జగన్వైపే అన్ని వేళ్లూ చూపిస్తున్నాయి’ అని ఎమ్మెల్సీ వర్ల అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు