Share News

పులివెందుల చేజారిందన్న నిస్పృహలో జగన్‌

ABN , Publish Date - Nov 22 , 2026 | 01:28 AM

పులివెందుల చేజారిపోయిందన్న నిరాశ, నిస్పృహలో జగన్‌ కొట్టుమిట్టాడుతున్నాడని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు.

పులివెందుల చేజారిందన్న నిస్పృహలో జగన్‌

  • సీనియర్‌ అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేయడం సరికాదు: వర్ల

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): పులివెందుల చేజారిపోయిందన్న నిరాశ, నిస్పృహలో జగన్‌ కొట్టుమిట్టాడుతున్నాడని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘బూటకపు దాడులు, నకిలీ హత్యయత్నాలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న జగన్‌ అరాచకాలకు పులివెందుల ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మాటిమాటికి గవర్నర్‌ను కలుస్తున్న జగన్‌.. తన సొంత చానెళ్లు, పత్రికల్లో వచ్చే అసత్యపు వార్తలు, కట్టుకథలు, బూటకపు దాడుల వివరాలు గవర్నర్‌కు అందించగలరా? పులివెందుల మున్సిపాలిటీని కూటమి గెలిచిన రోజే పులివెందుల ప్రజలు ేస్వచ్ఛగా వీధుల్లో తిరిగి అసలు సిసలైన దీపావళి జరుపుకున్నారు.

ఈ నిజాన్ని జగన్‌ గవర్నర్‌కు తెలియజేయగలరా? మేకపోతు గాంభీర్యంతో జగన్‌ రెండేళ్లలో తాను అధికారంలోకి వస్తానని అధికారులను బెదిరిస్తూ వారి సొంత పత్రికల్లో సీనియర్‌ అధికారుల ఫోటోల ప్రచురించి బ్లాక్‌ మెయిల్‌ చేయడం ఎంత వరకు సబబు? సొంత చెల్లి కూతురు(మేనకోడలు) వివాహనికి యలహంక ప్యాలెస్‌ ఇవ్వడానికి నిర్దయగా నిరాకరించాడు. ఈరోజు తన చెల్లి యలహంక ప్యాలెస్‌లోకి అడుగు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం... ఓ అన్నగా తగునా?ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేయగలరు?’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 01:32 AM