Share News

జగన్‌ ప్రమేయం లేకుండా చెల్లెలిపై నీచంగా రాస్తారా..!: సోమిరెడ్డి

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:11 AM

జర్నలిజం విలువలను పాటించడంలో జగన్‌ మీడియా నీచాతినీచంగా దిగజారిపోయింది అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు.

జగన్‌ ప్రమేయం లేకుండా చెల్లెలిపై నీచంగా రాస్తారా..!: సోమిరెడ్డి

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): జర్నలిజం విలువలను పాటించడంలో జగన్‌ మీడియా నీచాతినీచంగా దిగజారిపోయింది అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. ‘బద్ధ శత్రువులైనా పెళ్లిళ్లు, తదితర శుభకార్యాలకు పిలుచుకునే సంప్రదాయం ఉంది. నేనూ నా కుమార్తె పెళ్లికి అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఆహ్వానించా.

జగన్‌ మీడియా వైఖరే చాలా దారుణంగా ఉంది. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ద్వేషంతో రాష్ట్రమే నాశనం కావాలని కోరుకోవడం దుర్మార్గం. జగన్‌ ప్రమేయం లేకుండా ఆయన పత్రికలో సొంత చెల్లెలిపై దారుణమైన, నీచమైన రాతలు రాయగలరా? రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ సొంత మేనకోడలి వివాహ ఆహ్వానాలను కూడా రాజకీయం చేసి నీచాతినీచమైన రాతలు రాయడం దుర్మార్గం’ అని సోమిరెడ్డి విమర్శించారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 01:13 AM