సేవా సంకల్ప యాత్రకు టీడీపీ నేతల ఘనస్వాగతం
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:30 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని టీఎన్‌ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుమల నుంచి వారాణసీకి చేపట్టిన బైక్ యాత్ర ..
అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని టీఎన్‌ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుమల నుంచి వారాణసీకి చేపట్టిన బైక్ యాత్ర శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌తోపాటు పలువురు టీడీపీ నాయకులు యాత్రకు ఘనస్వాగతం పలికారు. శాప్ చైర్మన్ రవినాయుడు, వీఎంఆర్డీయే చైర్మన్ ప్రణవ్ గోపాల్, తదితరులు బైక్ యాత్ర నిర్వహిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు