Share News

నిజం గెలిచింది..రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది

ABN , Publish Date - Nov 01 , 2026 | 04:47 AM

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అక్రమ కేసులను ఎదుర్కొని జైలు నుంచి విడుదలై అక్టోబరు 31కి సరిగ్గా మూడేళ్లు పూర్తవుతోందని టీడీపీ నేత ఎస్‌వీఎ్‌సఎన్‌ వర్మ అన్నారు.

నిజం గెలిచింది..రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది

అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అక్రమ కేసులను ఎదుర్కొని జైలు నుంచి విడుదలై అక్టోబరు 31కి సరిగ్గా మూడేళ్లు పూర్తవుతోందని టీడీపీ నేత ఎస్‌వీఎస్ఎన్ వర్మ అన్నారు. జగన్‌ పెట్టిన అక్రమ కేసులు వీగిపోయి అంతిమంగా నిజం గెలిచిందని, రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని వర్మ అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గొడ్డలి పార్టీ నేత చేసిన దుర్మార్గాలకు ప్రజలు 11 సీట్లతో బుద్ధి చెప్పారన్నారు. జగన్‌ తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టగలిగారే కానీ జనం గుండెల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని చెరిపేయలేకపోయారని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 04:47 AM