కూటమి విజేతలకు వైసీపీ నేతల బెదిరింపులు
ABN , Publish Date - Nov 05 , 2026 | 07:00 AM
‘తాజా ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థులను వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘తాజా ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థులను వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. యాసిడ్ పోస్తాం, ఇళ్లు కూల్చేస్తాం, చంపేస్తామని అంటున్నారు. కూటమి తరఫున గెలిచిన అభ్యర్థులందరికీ పోలీసుల భద్రత కల్పించాలి’ అని కోరుతూ రాష్ట్ర ఎన్నికల జాయింట్ కమిషనర్, ఐజీ రాజకుమారికి బుధవారం టీడీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. వైసీపీ నేతల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. కాగా, ప్రజా తీర్పును గౌరవించకుండా వ్యవస్థలపై నిందలు వేయడం మానుకోవాలని జగన్‌కు ఎమ్మెల్సీ వర్ల రామయ్య హితవు పలికారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్