Share News

గెలిచే బలం లేక అల్లర్లు సృష్టిస్తున్నారు

ABN , Publish Date - Nov 27 , 2026 | 06:29 AM

సీపీ అధినేత జగన్‌ క్రిమినల్‌ ఇన్‌స్టింక్ట్‌తో సాగుతున్నారని,. పంచాయతీ ఎన్నికల్లో గెలిచే బలం లేక అల్లర్లు సృష్టించడమే మార్గంగా ఎంచుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య విమర్శించారు.

గెలిచే బలం లేక అల్లర్లు సృష్టిస్తున్నారు

  • పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తీరుపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌ క్రిమినల్‌ ఇన్‌స్టింక్ట్‌తో సాగుతున్నారని,. పంచాయతీ ఎన్నికల్లో గెలిచే బలం లేక అల్లర్లు సృష్టించడమే మార్గంగా ఎంచుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు.. అరాచకాలపై గురువారం టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం నాడైనా రాజ్యాంగ విరుద్ధ చర్యలు మానుకుని, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సజావుగా.. ప్రశాంతంగా సాగేందుకు జగన్‌ సహకరించాలని హితవు పలికారు.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 06:34 AM