వైసీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోంది
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:52 AM
స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని, నగదుతో ఓట్లు కొనుగోలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈమేరకు శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్బాబు ఫిర్యాదు చేశారు.
నందికొట్కూరు, చీమకుర్తిలో డబ్బులు పంచుతున్నారు
రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని, నగదుతో ఓట్లు కొనుగోలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈమేరకు శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్బాబు ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో 11వ వార్డులో ఓటుకు రూ.2 వేలు ఇస్తామంటూ వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్న ఆడియోను ఎన్నికల సంఘానికి అందజేశారు. చీమకుర్తి మున్సిపాలిటీలో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న అభ్యర్థి సుబ్రమణ్యంతోపాటు సురేశ్రెడ్డిని చీమకుర్తి సీఐ అదుపులోకి తీసుకున్నారని, వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వైసీపీ నేతలపై తగు చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!