ఈ ఫలితాలు చంద్రబాబుపై నమ్మకానికి నిదర్శనం
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:50 AM
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు, లోకేశ్‌ను కలసి అభినందనలు తెలిపిన పల్లా
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలసి అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు మద్దతు పలికారని, విధ్వంసాలు, కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల మనసులు గెలవలేరని ఈ తీర్పుతో స్పష్టం చేశారని పల్లా అన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమికి 94 శాతం స్ట్రైక్ రేట్ రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి లోకేశ్‌ను కూడా కలసి స్థానిక ఎన్నికల్లో ఘన విజయంపై శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్