రాజ్యాంగ స్ఫూర్తితో సుపరిపాలన లక్ష్యం: పల్లా
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:27 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరి హక్కులనూ కాపాడుతూ సుపరిపాలన అందించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరి హక్కులనూ కాపాడుతూ సుపరిపాలన అందించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ చట్టాలు ఎన్ని చేసినా వాటిని నిజాయతీగా అమలు చేసే నాయకులు, అధికారులు ఉండాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన విషయాన్ని అందరూ గుర్తెరగాలన్నారు. కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ వర్ల రామయ్య, ఎమ్మెల్యేలు గణబాబు, గల్లా మాధవి, ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్, టీడీపీ నేతలు ఎస్వీఎన్ వర్మ, పర్చూరి అశోక్‌బాబు, బుచ్చిరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సచివాలయంలో..
అమరావతి సచివాలయంలోని మొదటి భవనం ముఖ్యమంత్రి కార్యాలయం ఆవరణలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్వీసె్‌సశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సమాచారశాఖ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ పాల్గొనిసచివాలయ అధికారులు,ఉద్యోగులతో రాజ్యాంగ పీఠికను తెలుగులో పఠించారు. ప్రోటోకాల్ విభాగం సంయుక్త కార్యదర్శిరామసుబ్బయ్యతోపాటు సాధారణపరిపాలనాశాఖఅధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా