Share News

నాడు అత్త.. నేడు కోడలు.. చిత్తూరు మేయర్లు

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:21 AM

నాడు అత్త.. నేడు కోడలు చిత్తూరు మేయర్‌గా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీగా ఉన్న చిత్తూరు 2014లో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయింది. నాడు మేయర్‌కు పరోక్ష విధానంలో ఎన్నిక జరిగింది. తొలి మేయర్‌గా టీడీపీ నుంచి కఠారి అనురాధ ఎన్నికయ్యారు.

నాడు అత్త.. నేడు కోడలు.. చిత్తూరు మేయర్లు

నాడు అత్త.. నేడు కోడలు చిత్తూరు మేయర్‌గా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీగా ఉన్న చిత్తూరు 2014లో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయింది. నాడు మేయర్‌కు పరోక్ష విధానంలో ఎన్నిక జరిగింది. తొలి మేయర్‌గా టీడీపీ నుంచి కఠారి అనురాధ ఎన్నికయ్యారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో 2016లో మేయర్‌ చాంబరులో ఉన్న అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ హత్యకు గురయ్యారు. అప్పటి వరకు వంటింటికే పరిమితమైన కోడలు కఠారి హేమలత అనూహ్యంగా తెరపైకి వచ్చారు. కార్పొరేటర్‌గా ఎన్నికై... మేయర్‌ పదవి చేపట్టారు. దాదాపు రెండున్నరేళ్లు పనిచేశారు. తాజాగా జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో కఠారి హేమలత టీడీపీ తరపున మేయరుగా పోటీ చేసి 34,116 ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు. ఇలా అత్తా కోడళ్లు చిత్తూరు మేయర్లుగా పనిచేశారు.

- చిత్తూరు అర్బన్‌, ఆంధ్రజ్యోతి

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 05:21 AM