కాటికాపరి కుటుంబానికి ‘సర్పంచ్’ అవకాశం
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:50 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాటి కాపరి కుటుంబాన్ని అందలం ఎక్కించేందుకు కూటమి నేతలు ముందుకు వచ్చారు.
బుర్రిపాలెంలో కూటమి మద్దతుతో నామినేషన్
తెనాలి అర్బన్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాటి కాపరి కుటుంబాన్ని అందలం ఎక్కించేందుకు కూటమి నేతలు ముందుకు వచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా జెట్టి భారతికి గ్రామస్థులు మద్దతు తెలిపారు. టీడీపీ, జనసేన నాయకులు, ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఇప్పటికే నామినేషన్ వేయించారు. రిజర్వేషన్‌లో భాగంగా ఈ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించగా, ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
అయితే.. భారతి కుటుంబం పట్ల పంచాయతీ గ్రామాల్లో మంచి అభిప్రాయం ఉండడంతో కూటమి నేతలు మద్దతు పలికా రు. భారతి విజయం కోసం గ్రామంలో ప్రజలందరి సహకారం తీసుకుంటామని టీడీపీ నాయకులు శాఖమూరి వినోద్, పెమ్మసాని మనీశ్‌కుమార్, జనసేన నేత దివ్వెల మధుబాబు, పోలి రాజేశ్ చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..