Share News

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం.. పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

ABN , Publish Date - Mar 29 , 2026 | 09:18 AM

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ప్రస్థానం, చంద్రబాబు నాయకత్వం, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ఐక్యత అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం.. పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
TDP foundation day

అమరావతి, మార్చి 29: తెలుగువారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టించిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ నాలుగు దశాబ్దాల పైబడి ప్రజా క్షేత్రంలో బలంగా నిలబడిందని తెలిపారు. తెలుగు దేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
WhatsApp Image 2026-03-29 at 8.55.06 AM.jpeg


ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. ‘టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, క్లిష్ట పరిస్థితులు, పోరాటాలు ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు తన అపార రాజకీయ అనుభవంతో వాటన్నింటినీ అధిగమించి, ఆ పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపారు. రాజకీయ లక్ష్యాలతోపాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అజెండాగా నిర్దేశించి పార్టీని ముందుకు నడిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో, ప్రజా పక్షం వహిస్తూ చేపట్టిన రాజకీయ పోరాటాల్లో చంద్రబాబు ముద్ర ఉంది. కూటమి ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ఆ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం’అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

పదేళ్లకు పుట్టిందోచ్.. కచ్‌లో 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల జననం

ఆ రాశివారికి ఈ వారం ఆదాయం ఫుల్

Updated Date - Mar 29 , 2026 | 09:22 AM