Share News

విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ అధ్యక్షుడిగా మనోహర్‌ నాయుడు

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:19 AM

విజయవాడ పుస్తక మహోత్సవ నిర్వహణ సంస్థ, బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ అధ్యక్షుడిగా టి.మనోహర్‌ నాయుడు మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని సొసైటీ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో..

విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ అధ్యక్షుడిగా మనోహర్‌ నాయుడు

ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకవర్గం

విజయవాడ కల్చరల్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ పుస్తక మహోత్సవ నిర్వహణ సంస్థ, బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ అధ్యక్షుడిగా టి.మనోహర్‌ నాయుడు మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని సొసైటీ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో 2026-27 సంవత్సరానికి నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. 14 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా జక్కంపూడి ప్రసాద్‌, కార్యదర్శిగా కె.లక్ష్మయ్య ఎన్నికయ్యారు.

సహాయ కార్యదర్శిగా ఏబీఎస్‌ సాయిరామ్‌, కోశాధికారిగా కొండపల్లి రవి బాధ్యతలు చేపట్టనున్నారు. వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా ఎస్‌.రామారావు, విశ్వేశ్వరరావు, జి.లక్ష్మి, జి.నారాయణరావు, బి.రవికుమార్‌, కె.శ్రీనివాస్‌, వి.శ్రీనివాసరావు, ఎన్‌ఎన్‌ నాగిరెడ్డి, వల్లూరి శివప్రసాద్‌, కె.సత్యరంజన్‌, చలపాక ప్రకాశ్‌, ఎన్‌.రాజ్‌గోపాల్‌, కె.జయరాజ్‌, పి.సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. విజయవాడ పుస్తక మహోత్సవం ఇప్పటికే 36 ప్రదర్శనలను పూర్తిచేసుకుంది. త్వరలో నిర్వహించనున్న 37వ ప్రదర్శనకు సొసైటీ సన్నద్ధమవుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 05:19 AM