Share News

ఆందోళనకారులపై కేసులు!

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:30 AM

స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనలో సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు చేసినవారెవరో నిఘా అధికారులు ఆరా తీస్తున్నారు. బయటి వ్యక్తుల ప్రమేయంపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. విజయవాడలో ఆందోళనకు అనుమతి లేదని...

ఆందోళనకారులపై కేసులు!

  • క్రమశిక్షణ చర్యలు కూడా.. కొందరు ఉద్యోగులు

  • ఇష్టానుసారం వ్యవహరించారని గుర్తింపు

అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనలో సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు చేసినవారెవరో నిఘా అధికారులు ఆరా తీస్తున్నారు. బయటి వ్యక్తుల ప్రమేయంపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. విజయవాడలో ఆందోళనకు అనుమతి లేదని, హెడ్‌క్వార్టర్స్‌ దాటి వెళ్లవద్దని ఆదేశాలు ఉన్నా.. ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు నివేదిక పంపారు. ఆందోళనలో పాల్గొనడమే గాకుండా.. కొందరు ఇష్టానుసారం వ్యవహరించారని నిఘా వర్గాలు గుర్తించాయి. వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిశ్చయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించి.. ఆయన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 03:30 AM