Share News

తిరుపతి గంజాయి కేసు నిందితుడికి చుక్కెదురు

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:44 AM

గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న న్యాయశాస్త్ర విద్యార్థి వి.కృష్ణకిశోర్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

తిరుపతి గంజాయి కేసు నిందితుడికి చుక్కెదురు

గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న న్యాయశాస్త్ర విద్యార్థి వి.కృష్ణకిశోర్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అతనికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. గతంలో తిరుపతిలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, వారిచ్చిన సమాచారం మేరకు కృష్ణకిశోర్‌ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. 1.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసులో అతనికి ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.

ఆ తీర్పును గతనెల 28న సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా, ఆ పిటిషన్‌ బుధవారం జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సంచితా ఐన్‌ వాదనలు వినిపించారు. కృష్ణకిశోర్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇవ్వాలన్న వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. అంతేగాక మధ్యంతర రక్షణనైనా కల్పించాలన్న పిటిషనర్‌ విజ్ఞప్తిని సైతం పరిగణనలోకి తీసుకోలేదు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 12:48 AM