చూసింది చూసినట్టు తల్లిదండ్రులకు చెప్పాలి..!
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:49 AM
బడిలో కానీ.. బడి బయట కానీ.. ఊరిలో కానీ.. ఊరి బయట కానీ... చూసింది చూసినట్టు.. తెలిసింది తెలిసినట్టు తల్లిదండ్రులకు, గురువులకు చెప్పాలి..’
విద్యార్థినులు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి
‘విద్యార్థినీ... జరభద్రం’లో పోతుల బాలకోటయ్య
గన్నవరం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘బడిలో కానీ.. బడి బయట కానీ.. ఊరిలో కానీ.. ఊరి బయట కానీ... చూసింది చూసినట్టు.. తెలిసింది తెలిసినట్టు తల్లిదండ్రులకు, గురువులకు చెప్పాలి..’ అని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య విద్యార్థినులకు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో సోమవారం ‘విద్యార్థినీ.. జర భద్రం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకోటయ్య మాట్లాడుతూ.. రాప్తాడు సంఘటన నేపథ్యంలో విద్యార్థినులు ఇంటర్నెట్, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆడపిల్లలపై అకృత్యాలకు పాల్పడితే ప్రభుత్వం, చట్టాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఈవీఆర్ గిరి కుమారి మాట్లాడుతూ.. ‘విద్యార్థినీ.. జర భద్రం’ వంటి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గురుకులాల కో ఆర్డినేటర్ అంగడి మురళీకృష్ణ, సామాజిక సేవకులు కోగంటి వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి: