తుపాకీతో స్కూలుకొచ్చి బెదిరింపు
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:55 AM
కడపలోని ఓ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ స్కూల్‌నే గడగడలాడించింది. ఓ విద్యార్థి తండ్రి తుపాకీతో స్కూల్‌కు వచ్చి గూండాగిరి చేయడం,...
ఓ విద్యార్థి తండ్రి బరితెగింపు
తన కుమారుడితో తోటి విద్యార్థి గొడవే కారణం
కడపలో వెలుగులోకి ఘటన
కడప క్రైం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కడపలోని ఓ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ స్కూల్‌నే గడగడలాడించింది. ఓ విద్యార్థి తండ్రి తుపాకీతో స్కూల్‌కు వచ్చి గూండాగిరి చేయడం, తోటి విద్యార్థిని, ప్రిన్సిపాల్‌ను తుపాకీ చూపి బెదిరించడం కలకలం రేపింది. ఇటీవలి రాప్తాడు ఘటనను గుర్తుచేసుకుని విద్యార్థులు వణికిపోయారు. కడప రాజారెడ్డి వీధిలోని నారాయణ పాఠశాలలో ఈ నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కడప కటిక వీధికి చెందిన పీరుల్లా కుమారుడితో పాటు ఆవుల శ్రీనివాసనాయుడు కొడుకు 10వ తరగతి చదువుతున్నారు.
ఆ ఇద్దరి మధ్య ఇటీవల గొడవ జరిగింది. ఈ విషయంలో శ్రీనివాసనాయుడు 26న నేరుగా పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ చాంబరులో కూర్చుని తుపాకీతో ప్రిన్సిపాల్‌ను, తన కుమారుడితో గొడవ పడిన విద్యార్థిని బెదిరించాడు. దీంతో అక్కడి సిబ్బంది, ఇతర విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి తండ్రి పీరుల్లా, పాఠశాల ఏజీఎం శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసనాయుడి వద్ద ఉన్న తుపాకీ నిజమైనదా, కాదా.. దానికి లైసెన్స్ ఉందా లేదా అనేది విచారణలో తేలుతుందని ఎస్‌ఐ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..