శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం.. స్పర్శ దర్శనాల నిలుపుదల
ABN , Publish Date - May 29 , 2026 | 09:57 AM
శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి సోమవారం వరకు స్పర్శ దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.
నంద్యాల, మే 29: శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి(శుక్రవారం) నుంచి సోమవారం వరకు స్పర్శ దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే యధావిధిగా స్పర్శ దర్శనం కొనసాగించనున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావించిన ఈవో ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఇంట్లో పేలిన ఏసీ.. మాజీ ఐఏఎస్ కన్నుమూత