Share News

శ్రీశైలంలో అడుగంటుతున్న నీటి నిల్వలు

ABN , Publish Date - Oct 16 , 2026 | 04:18 AM

శ్రీశైల జలాశయం క్రమక్రమంగా అడుగంటుతోంది. ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో తెలంగాణ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోంది.

శ్రీశైలంలో అడుగంటుతున్న నీటి నిల్వలు

  • విద్యుదుత్పత్తి ఆపని తెలంగాణ

  • 841 అడుగులకు చేరిన నీటిమట్టం

శ్రీశైలం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల జలాశయం క్రమక్రమంగా అడుగంటుతోంది. ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో తెలంగాణ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోంది. దీంతో జలాశయం వేగంగా ఖాళీ అవుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 841.40 అడుగులు ఉంది. నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను 63.93 టీఎంసీలే ఉందని అధికారులు వెల్లడించారు. ఇరిగేషన్‌ శాఖ గణాంకాల ప్రకారం..

గురువారం సాయంత్రానికి హంద్రీ-నీవా ప్రాజెక్టుకు 1,694 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు విడుదల చేశారు. తెలంగాణ విద్యుదుత్పత్తికి 42,378 క్యూసెక్కుల నీటిని వినియోగించి నాగార్జునసాగర్‌కు విడిచిపెట్టింది. కృష్ణా బోర్డు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 04:18 AM