శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:59 AM
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రాతఃకాలపూజలు, సుప్రభాతసేవ, మహామంగళ హారతులు, ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు.
శ్రీశైలం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రాతఃకాలపూజలు, సుప్రభాతసేవ, మహామంగళ హారతులు, ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. మార్గశిరమాస శుద్ధ పాడ్యమి వరకు 24 గంటలపాటు నిరంతరంగా సాగే శివపంచాక్షరి మంత్ర భజనలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్ర భజన మండలి సభ్యులకు దేవ స్థానం అవకాశం కల్పించింది.
కార్తీకమాసం తొలిరోజు భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అభిషేకాలు నిర్వహించుకునే భక్తులకు పురాతన పంచమఠాలలో కొలువైఉన్న శివలింగాల వద్ద అవకాశం కల్పించినట్టు ఈఓ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు, కేశఖండన టికెట్లను మనమిత్ర వాట్సాప్, టి.ఎమ్.ఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!