Share News

స్కందమాత అలంకారంలో భ్రామరి

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:52 AM

శ్రీశైల క్షేత్రం దేవి శరన్నవరాత్రి వేడుకలతో సందడిగా మారింది. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు భ్రమరాంబదేవి స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు.

స్కందమాత అలంకారంలో భ్రామరి

శ్రీశైలం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రం దేవి శరన్నవరాత్రి వేడుకలతో సందడిగా మారింది. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు భ్రమరాంబదేవి స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి అమ్మవారు మల్లికార్జున స్వామివారితో కలసి శేషవాహనంపై విహరించారు. ప్రధానాలయంలో అమ్మవారి సింహమండపం వద్ద గల ప్రత్యేక వేదికపై అమ్మవారి స్కందమాత అలంకార ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో శేషవాహనంపై ఆదిదంపతులకు షోడశోపచార పూజా క్రతువులు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, కళాకారుల విన్యాసాల నడుమ గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది.

కాగా.. ఆరో రోజు శుక్రవారం అమ్మవారు కాత్యాయని అలంకరణలో హంస వాహనంపై దర్శనమిస్తారు. పుష్పపల్లకిపై ఆదిదంపతుల గ్రామోత్సవం ఉంటుందని ఆలయ ఈఓ శ్రీనివాసరావు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పోతుగుంట రమేశ్‌ నాయుడు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 03:52 AM