అంబేడ్కర్ విగ్రహం పనులు పూర్తి చేయాలి
ABN, Publish Date - Sep 01 , 2026 | 11:40 PM
టెక్కలి అంబేడ్కర్ జంక్షన్‌లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులు వారంరోజుల్లో పూర్తి చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.
టెక్కలి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): టెక్కలి అంబేడ్కర్ జంక్షన్‌లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులు వారంరోజుల్లో పూర్తి చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. మంగళవారం విగ్రహ ఏర్పాటు పనులు పరిశీలించిన అచ్చెన్నాయుడు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను, ఆ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పైఉన్న తోపుడుబండ్లను తొలగించాలని అధికారులకు కోరారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆధునికీ కరణ పనులతో సుందరీకరణగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆయనతో పాటుఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఆర్‌అండ్‌బీ ఈఈ రవికాంత్, కోళ్ల లవకుమార్, మట్ట పురుషోత్తం, అప్పలస్వామి, రెయ్యి ప్రీతీష్, దోని బుజ్జి, పేర మురళి ఉన్నారు.
అన్నక్యాంటీన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కోటబొమ్మాళి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): అన్నక్యాంటీన్‌ను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. మంగళ వారం కోటబొమ్మాళి తహసీల్ధార్ కార్యాలయం ఎదురుగా ఉన్న అన్నక్యాంటీను తనిఖీచేశారు. ఈసందర్భంగా కూటమి ప్రభుత్వం పేదలకు రూ.ఐదుకే అందజేస్తున్న టిఫిన్, భోజనం ఎలా ఉందోనని భోజనం చేస్తున్న మహిళలకు అడిగితెలుసుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ మండలాధ్యక్షుడు బోయిన సత్యశ్రీనివాస్, నేతలు లాడి శ్రీనివాస్, ధర్మాన నాగరాజు, పల్లి రాంబాబు, నేతింటి అప్పన్న ఉన్నారు.
Updated at - Sep 01 , 2026 | 11:40 PM