Share News

ఘోర విషాదం.. పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి..

ABN , Publish Date - Aug 09 , 2026 | 07:02 PM

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం భారీ వర్షాలతో కూడిన పిడుగులు బీభత్సం సృష్టించాయి. మందస ఏజెన్సీ ప్రాంతంలోని పాతకోటలో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఘోర విషాదం.. పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి..
Srikakulam Lightning Strike

శ్రీకాకుళం: జిల్లాలో ఇవాళ (ఆదివారం) భారీ వర్షాలతో కూడిన పిడుగులు బీభత్సం సృష్టించాయి. మందస ఏజెన్సీ ప్రాంతంలోని పాతకోటలో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కట్ట సుమిద్రి, సవర జోరాగా గుర్తించారు. బాధితులంతా వ్యవసాయ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పాతకోటలో విషాద ఛాయలు అలుముకోగా.. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మారింది. శ్రీకాకుళం జిల్లాతో పాటు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో చెట్లు, విద్యుత్‌ స్తంభాల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు

రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

Updated Date - Aug 09 , 2026 | 07:04 PM