రానున్న రోజుల్లో మరిన్ని జాబ్‌మేళాలు
ABN, Publish Date - Jun 18 , 2026 | 11:41 PM
: రానున్న రోజుల్లో మరిన్ని జాబ్‌మేళాలను నిర్వహించి యువతకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తుందని ఇచ్ఛా పురం ఎమ్మెల్యే, పభుత్వ విప్ బెందాళం అశోక్ తెలిపారు.
సోంపేట, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : రానున్న రోజుల్లో మరిన్ని జాబ్‌మేళాలను నిర్వహించి యువతకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తుందని ఇచ్ఛా పురం ఎమ్మెల్యే, పభుత్వ విప్ బెందాళం అశోక్ తెలిపారు. గురువారం సోంపేటలో నిర్వహించిన జాబ్‌మేళాలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా జాబ్‌మేళాలు నిర్వహించినట్లు చెప్పారు. 17 సంస్థలు పాల్గొన్న మేళాలో 259 మంది హాజరుకాగా అందులో 107మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయికుమార్, శేషాద్రి, తేజేశ్వరరావు, జే.జయశంకర్, టీడీపీ నాయకులు సూరాడ చంద్రమోహన్, మడ్డు కుమార్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, చిత్రాడ శేఖర్ పాల్గొన్నారు.
Updated at - Jun 18 , 2026 | 11:41 PM