Share News

శ్రీకాకుళంలో విషాదం.. పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Oct 07 , 2026 | 09:34 AM

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గడ్డి మందు పాలలో కలిపి పిల్లలకు ఇచ్చి, అనంతరం తాను కూడా సేవించినట్లు తెలుస్తోంది.

శ్రీకాకుళంలో విషాదం.. పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం.. ఇద్దరి మృతి
Srikakulam Tragedy

శ్రీకాకుళం, అక్టోబర్ 7: జిల్లాలోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిలకపాలెంకు చెందిన మీనాక్షి(29) తన ఇద్దరు పిల్లలకు గడ్డి మందు పాలలో కలిపి ఇచ్చిన అనంతరం తాను కూడా సేవించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం ముగ్గురినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో మీనాక్షి.. ఆమె ఏడు నెలల కుమారుడు కులదీప్ మృతి చెందారు. రెండున్నరేళ్ల కుమార్తె గాయిత్రి పరిస్థితి విషమంగా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లీకొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఈ ఘటనపై మృతురాలి తల్లి అమ్మాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మీనాక్షి భర్త జగదీష్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబంలో నెలకొన్న కలహాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నప్పటికీ.. అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన పరిణామాలు.. విషపదార్థం వినియోగం తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 11:49 AM