పులి కోసం వేట మొదలైంది!
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:24 AM
ఉభయ గోదావరి జిల్లాలను వణికిస్తున్న పెద్ద పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పుణే నుంచి వచ్చిన వన్యప్రాణి రెస్క్యూ...
రమణక్కపేట రిజర్వ్ ఫారెస్ట్‌లోనే తిష్ఠ
బంధించేందుకు పుణే నుంచి ప్రత్యేక బృందం
ముసునూరు/విస్సన్నపేట, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాలను వణికిస్తున్న పెద్ద పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పుణే నుంచి వచ్చిన వన్యప్రాణి రెస్క్యూ, ట్రాంక్విలైజేషన్ బృందం బుధవారం ఏలూరు జిల్లాలో పులి సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకుంది. పులిని బంధించేందుకు జిల్లా అటవీ శాఖ అధికారి సందీ్‌పరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఆపరేషన్‌ను చేపట్టారు. కాగా, బుధవారం ఉదయం ముసునూరు మండలంలోని రమణక్కపేట రిజర్వు ఫారెస్ట్‌లో పెద్దపులి కనిపించింది.
చాట్రాయి మండలం మర్లపాలెం, చిత్తపూరు గ్రామాల మీదుగా రమణక్కపేట రిజర్వు ఫారెస్టులోని బోడిదిబ్బ గట్టుకు పులి చేరుకున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రాత్రి వరకు పులి అక్కడే ఉంది. కాగా.. పులి సంచారం నేపథ్యంలో గట్టుకు మరో వైపు ఉన్న ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ అటవీ ప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్థులను బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్