Share News

1న మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:11 AM

బ్యాంకు సెలవులు, బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో సామాజిక పెన్షన్‌దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

1న మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ

బ్యాంకు సెలవులు, బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో సామాజిక పెన్షన్‌దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శనివారం బ్యాంకు సెలవు కాగా 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దీంతో అక్టోబరు 1వ తేదీ ఉదయమే పింఛన్ల పంపిణీకి నగదును విత్‌డ్రా చేసుకునేలా బ్యాంకులను అందుబాటులో ఉంచాలని ఎస్‌ఎల్‌బీసీకి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. స్వర్ణగ్రామం/స్వర్ణవార్డు సిబ్బంది ఉదయం బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసి, అదే రోజు మధ్యాహ్నం నుంచి నేరుగా ఫించన్‌దారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. బ్యాంకు సెలవులు, సమ్మె కారణాల వల్ల పెన్షన్ల పంపిణీ తేదీ, విధానంలో జరిగిన ఈ మార్పులను సామాజిక పెన్షన్‌దారులందరూ గమనించాలని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 05:11 AM