Share News

పిఠాపురంలో మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రం

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:40 AM

కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారంలో అపోలో ఫౌండేషన్‌-టోటల్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన అపోలో ఆరంభ్‌ మోడల్‌ అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించా రు

పిఠాపురంలో మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రం

  • 50 లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలు

  • అపోలో ఫౌండేషన్‌-టోటల్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో నిర్మాణం

  • ప్రారంభించిన స్మృతి ఇరానీ, ఉపాసన

పిఠాపురం, నవంబరు 20 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారంలో అపోలో ఫౌండేషన్‌-టోటల్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన అపోలో ఆరంభ్‌ మోడల్‌ అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించా రు. శుక్రవారం అపోలో గ్రూపు హాస్పిటల్స్‌ (సీఎస్‌ఆర్‌) ఉపాధ్యక్షురాలు, సినీనటుడు రామచరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి ఆమె ప్రారంభించారు. స్మృతి ఇరానీ మాట్లాడు తూ.. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని గృహాల్లో శుభ కార్యక్రమాలు జరిగినప్పుడు కేంద్రాల్లో పిల్ల లు, గర్భిణీలకు పండ్లు, పాలు అందించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణలో పిఠాపురం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అంగన్‌వాడీల అభివృద్ధికి అపోలో గ్రూపు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఉపాసన మాట్లాడుతూ.. ‘డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్‌ మీకందరికి పవర్‌స్టార్‌. నాకు మాత్రం ఎంపవర్‌ స్టార్‌’ అని అన్నారు. అంగన్‌వాడీలను అభివృద్ధి చేయాలని అపోలో గ్రూపు నిర్ణయించి దానిని పిఠాపురం నుంచే శ్రీకారం చుట్టిందని తెలిపారు. కార్యక్రమంలో అపోలో ఫౌండేషన్‌ సీఈవో ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అత్యాధునిక సదుపాయాలు

అపోలో గ్రూపు-టోటల్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో రూ.50 లక్షల వ్యయంతో పిఠాపురంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్మించారు.

ఇందులో ఆహ్లాదకరమైన పరిసరాలు, లాన్‌, డిజిటల్‌ పాఠాలకు ఎల్‌ఈడీ స్ర్కీన్లు, క్రీడా పరికరాలు, భోజనశాల, విద్యార్థులు కుర్చునేందుకు చైర్లు, టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇదే తరహాలో 109 అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 06:19 AM