39,888 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు పూర్తి
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:49 AM
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
కోరంలేక కొన్ని, సీఎం సభ వల్ల మరికొన్ని!
ఎన్నికలు జరగని పాఠశాలలు 4171.. వాటిలో రేపు నిర్వహణ
అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో 39,888 పాఠశాలల్లో సభ్యులు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకున్నారు. 321 పాఠశాలల్లో కోరం లేక ఎన్నికలు జరగలేదు. ముఖ్యమంత్రి సభ ఉన్నందున నెల్లూరులో ఎన్నికలు నిర్వహించలేదు. సీఎం సభ వల్ల ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో ఎన్నికలు జరపలేదు. కృష్ణా జిల్లాలోని ఓ పాఠశాలలో గొడవలు జరిగే అవకాశం ఉందని స్థానిక ఎస్‌ఐ ఇచ్చిన సమాచారంతో ఎన్నికలు ఆపేశారు. కడప జిల్లాలో 352 పాఠశాలల్లో ఎన్నికలు జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగని 4171 పాఠశాలల్లో గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం