Share News

నంద్యాల జిల్లాలో దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను..

ABN , Publish Date - Mar 18 , 2026 | 09:49 PM

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ తన భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసింది. నంద్యాల జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

నంద్యాల జిల్లాలో దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను..
Nandyal case

ఇంటర్‌నెట్ డెస్క్: నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ తన భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. గడివేముల మండలం గడిగరేవుల గ్రామానికి చెందిన శ్రీనివాసులు, వరలక్ష్మి భార్యాభర్తలు. వరలక్ష్మి అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఆమె భర్త శ్రీనివాసులుకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయి.


మార్చి 10వ తేదీన కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి తన భర్తను తోసేసింది. కిందపడ్డ శ్రీనివాసులు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో వరలక్ష్మి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిచి చంపేసింది. హత్య తర్వాత శవాన్ని దేవస్థానం కల్యాణ మండపం సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ శవంపై యాసిడ్ కార్పెట్లు, చెత్త వేసి కాల్చేశారు.


సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వరలక్ష్మిని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రియుడి సాయంతో తానే భర్తను చంపేశానని వరలక్ష్మి ఒప్పుకుంది. పోలీసులు వరలక్ష్మిని, ఆమెకు సహకరించిన వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

బలవంతపు పెళ్లి, వేధింపుల కారణంగానే విడాకులు.. ఖర్గే వ్యాఖ్యలకు దేవెగౌడ కౌంటర్

ధోనీ జెర్సీ నంబర్ మారుతోందా.. ఐపీఎల్ 2026లో 7 నుంచి 8కి..

Updated Date - Mar 18 , 2026 | 09:55 PM