Share News

ధోనీ జెర్సీ నంబర్ మారుతోందా.. ఐపీఎల్ 2026లో 7 నుంచి 8కి..

ABN , Publish Date - Mar 18 , 2026 | 09:28 PM

ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్ మారనుందా? అతడి జెర్సీ నంబర్ 7 నుంచి 8కి మారబోతోందా? ఫేస్‌బుక్‌లో ధోనీ పెట్టిన తాజా పోస్ట్ ఆ చర్చకు కారణంగా నిలిచింది. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో ధోనీ ఏడో నెంబర్ జెర్సీతోనే బరిలోకి దిగాడు.

ధోనీ జెర్సీ నంబర్ మారుతోందా.. ఐపీఎల్ 2026లో 7 నుంచి 8కి..
MS Dhoni jersey number

ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్ మారనుందా? అతడి జెర్సీ నంబర్ 7 నుంచి 8కి మారబోతోందా? ఫేస్‌బుక్‌లో ధోనీ పెట్టిన తాజా పోస్ట్ ఆ చర్చకు కారణంగా నిలిచింది. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో ధోనీ ఏడో నంబర్ జెర్సీతోనే బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ, ఐపీఎల్‌లోనూ కూడా ధోనీ ఈ నంబర్ జెర్సీతోనే ఆడాడు. అయితే మంగళవారం ధోనీ చేసిన ఓ పోస్ట్ జెర్సీ నంబర్ గురించి సరికొత్త చర్చకు తెర తీసింది(MS Dhoni jersey number).


'కొన్ని అంకెలు మనతోనే ఉండిపోతాయి. 7 ఎప్పుడూ వాటిలో ఒకటి. కానీ ఈ రోజు నేను 8కి మారుతున్నాను. ఎందుకో మీకు త్వరలోనే తెలుస్తుంది' అంటూ ధోనీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఒక పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది అభిమానులు ధోనీని 7వ నంబర్ జెర్సీకే కట్టుబడి ఉండమని కోరారు. మరికొందరు మాత్రం అది కేవలం ఒక ప్రచార ఎత్తుగడ మాత్రమే అని పేర్కొన్నారు(Dhoni jersey change 8).


ధోనీకి, నంబర్ 7కు ఉన్న బంధం కేవలం క్రికెట్‌కు సంబంధించినది మాత్రమే కాదు(IPL Dhoni updates). ధోనీ పుట్టిన తేదీ జులై 7 (07/07). అందుకే కెరీర్ ఆరంభం నుంచి ధోనీ ఏడో నంబర్ జెర్సీతోనే ఆడుతున్నాడు. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో నంబర్ 7 జెర్సీని రిటైర్ చేసింది. ఇలాంటి తరుణంలో ధోనీ ఐపీఎల్‌ కోసం తన లక్కీ నంబర్‌ను మార్చుకోడని, ఇది కేవలం ఓ ప్రమోషనల్ స్టంట్ మాత్రమేనని చాలా మంది భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..


మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 18 , 2026 | 09:49 PM