నోటిమాట కాదు.. బాండ్ పేపరుపై హామీ!
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:23 AM
న్నికల్లో ఇచ్చే హామీలు నెరవేర్చకపోతే నిలదీయాలని చెబుతూ ఓ సర్పంచ్ అభ్యర్థి బాండు పేపర్లపై హామీలు రాసి ఓటర్లకు పంచుతున్నారు.
గెలిచాక నెరవేర్చకపోతే నిలదీయండి
శ్రీకాకుళం జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం
ఇచ్ఛాపురం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చే హామీలు నెరవేర్చకపోతే నిలదీయాలని చెబుతూ ఓ సర్పంచ్ అభ్యర్థి బాండు పేపర్లపై హామీలు రాసి ఓటర్లకు పంచుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేశుపురం గ్రామ పంచాయతీలో కూటమి మద్దతు అభ్యర్థి గుజ్జు రీషా ఈ విధమైన వినూత్న ప్రచారం చేస్తున్నారు. కేశుపురం, సన్యాసిపుట్టుగ, నీలాపుపుట్టుగ గ్రామాలతో కూడిన ఈ పంచాయతీలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టబోయే పనులను బాండు పేపర్లపై పొందుపరిచి ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా తనను నిలదీయాలని ఓటర్లకు చెబుతున్నారు. భర్త భీమరాజుతో కలిసి రీషా చేస్తున్న ప్రచారానికి స్పందన లభిస్తోంది. పంచాయతీ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, అందుకే నోటిమాటకు పరిమితం కాకుండా బాండు పేపర్లపై హామీలు ఇస్తున్నానని ఆమె చెబుతున్నారు.
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి