Share News

ప్రజల ఆరోగ్యమే సంజీవని లక్ష్యం: సత్యకుమార్‌

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:40 AM

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు. వ్యక్తిగత వైద్య వివరాలను డిజిటల్‌గా నమోదు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.

ప్రజల ఆరోగ్యమే సంజీవని లక్ష్యం: సత్యకుమార్‌

  • ధర్మవరంలో ఆరోగ్య రథాలను ప్రారంభించిన మంత్రి

ధర్మవరం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు. వ్యక్తిగత వైద్య వివరాలను డిజిటల్‌గా నమోదు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. డిసెంబరు 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని, జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి తెస్తామని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 71 ఆరోగ్య రథాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఆరోగ్య రథాల్లో 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చు అయ్యే పరీక్షలను కూడా ఉచితంగా అందిస్తామని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 05:40 AM