Share News

వ్యాపార రంగం బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:33 AM

వాణిజ్యం, పరిశ్రమలు, వ్యాపారోద్యమాన్ని ప్రోత్సహించడంతోపాటు నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా వ్యాపార రంగాన్ని బలోపేతం చేయడమే సమాఖ్య చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లక్ష్యమని సీనియర్‌ చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ ఏవీ రత్నం చెప్పారు.

వ్యాపార రంగం బలోపేతమే లక్ష్యం

  • మంగళగిరిలో సమాఖ్య-2026 గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌

మంగళగిరి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వాణిజ్యం, పరిశ్రమలు, వ్యాపారోద్యమాన్ని ప్రోత్సహించడంతోపాటు నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా వ్యాపార రంగాన్ని బలోపేతం చేయడమే సమాఖ్య చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లక్ష్యమని సీనియర్‌ చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ ఏవీ రత్నం చెప్పారు. మంగళగిరిలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఆదివారం సమాఖ్య-2026 గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ జరిగింది. సమాఖ్య చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, విశ్వ సమాఖ్య పటేల్‌ ఎంటర్‌టైనర్‌ నెట్‌వర్క్‌, అఖిల భారత తెలగ బలిజ కాపు సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. దేశ వ్యాప్తంగా సమాఖ్య వెనుక వెయ్యి మందికి పైగా చార్టర్డ్‌ ఎకౌంటెంట్లు ఉన్నారని రత్నం తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు, ఆర్థిక సంస్థలతో అనుసంధానం, అంతర్జాతీయ చాంబర్ల భాగస్వామ్యంతో ప్రపంచ మార్కెట్‌ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. సమాఖ్య గ్లోబల్‌-2026 కార్యక్రమాన్ని అక్టోబరు 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్‌ ఎగ్జిబిషన్‌ సెంటరులో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

పదే పదే కబ్జా

భారీ వర్షం

Updated Date - Sep 21 , 2026 | 05:33 AM